Sreemukhi Biggboss8: నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు.. ఇంకా రెండు వారాలే ఉంది
on Nov 30, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో టికెట్ టు ఫినాలే కోసం జరిగిన అన్ని టాస్క్ లలో టాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అవినాష్. ఇక అతను డైరెక్ట్ ఫినాలేకి చేరుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి హౌస్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఆడించింది.
ఇక హౌస్ లో విష్ణుప్రియ చేసే పత్తాపరం గురించి తనకి అర్థమయ్యేలా శ్రీముఖి ఓ పక్కకి తీసుకొని వెళ్ళి మరీ చెప్పింది. " ఇన్ని వారాలు గడిచిపోయింది. ఇక చాలు ఇంకా రెండు వారాలే ఉంది. ఇక పృథ్వీని విడిచిపెట్టు.. నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు. తన గేమ్ తను ఆడతాడు. అసలు నువ్వంటే ఫ్రెండ్ మాత్రమే అని చెప్పినా, ఇష్టం లేదని అంత క్లారిటీగా ఉన్నా నువ్వు తనతో ఉండటం మానేయ్.. మిగిలిన హౌస్ మేట్స్ తో టైమ్ స్పెండ్ చెయ్ అని శ్రీముఖి అనగానే..తెలుసు కదా నాకు పృథ్వీ అంటే ఎంత కేరింగో అంటూ అదే సోది చెప్పుకొచ్చింది నత్తి బుర్ర విష్ణుప్రియ.
హౌస్ లోకి టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఆడించడానికి వచ్చిన శ్రీముఖికి బిగ్ బాస్ ఓ స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు. అదేంటంటే.. అమ్మా కళామతల్లి ముద్దుబిడ్డ.. ఇక నీ ఆట నువ్వు ఆడు.. ఇన్ని రోజులు నువ్వు చేసిన పత్తాపారం బాగా సాగింది. మనకి ఫుల్ టీఆర్పీ కూడా వచ్చింది. ఇక హౌస్ లో ఎంటర్‌టైనర్స్ గా ఉన్నా అవినాష్, రోహిణి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటూ ఆడుతూ .. మెగా ఛీఫ్ లు అయ్యారు. నువ్వు ఇంకా ఆ పృథ్వీ చుట్టూ తిరగడం మానేయాలని బిగ్ బాస్ మామ చెప్పాడు. ఇదే స్క్రిప్ట్ ని విష్ణుప్రియని పక్కకి తీసుకొచ్చి మరీ చెప్పింది శ్రీముఖి. ఇక హౌస్ లో ఓ వైపు గేమ్స్ ఆడిస్తూ మరోవైపు వీరిద్దరికి జ్ఞానోపదేశం చేస్తోంది శ్రీముఖి. ఇక చాలు ఎవరి గేమ్ వారు ఆడండి. తనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నువ్వు క్లియర్ గా ఆమెకి చెప్పాలి కదా అంటూ పృథ్వీ అనగానే.. తనకు నేను చెప్పాను. ఫ్రెండ్ వరకే.. నా కోసం నువ్వు నీ గేమ్ ఆడకుండా ఉండకు అని చెప్పానంటూ పృథ్వీ అన్నాడు.
విష్ణుప్రియకి వాళ్ళ నాన్న హౌస్ లోకి వచ్చి మరీ చెప్పాడు. మారలేదు.. యాంకర్ రవి చెప్పాడు మారలేదు. విష్వక్సేన్ వచ్చి చెప్పాడు మారలేదు. మానస్ చెప్పాడు మారలేదు. పునర్నవి చెప్పింది మారలేదు. ఇంకా తను మారదు అని తెలిసినా బిగ్ బాస్ మామ మాత్రం తనని సేవ్ చేస్తూ వస్తున్నాడు. టాప్-2 కి తీసుకొచ్చి విష్ణుప్రియకి సెకెంఢ్ ఇచ్చి నిఖిల్, గౌతమ్, నబీల్ లలో ఎవరికో ఒకరిని విన్నర్ చేసేలా ప్లాన్ చేసినట్టున్నాడు బిగ్ బాస్.
Also Read